బైబిల్ అంటే ఏమిటి ?


✳ బైబిల్  అనగా ఏమి?
బైబిల్ ను ఎలా అర్దము చేసుకోవాలి ?? .....✍
( మొదటి భాగము )

🙏ప్రభువు నామములో మీకు, మీ  కుటుంబమునకు వందనాలు తెలయాజేస్తున్నాను.

👉ఈ రోజులలో సుమారు 33,000 denominations ఉన్నాయి. ఒకే bible కలిగిన christians అందరు ఒక్కటిగా లేకుండా ఇలా 33,000 denominations గా విడిపోయారు. 10th class, intermediate ,btech ఇలా ఈ degree అయిన pass అవ్వాలంటే కష్టపడాలని తెలుసు.
🔺మనిషి ఆలోచనలో నుంచి పుట్టిన booksను నేర్చుకోవాలంటే అర్థము. చేసుకోవాలి, కష్టపడాలన్న విషయము మనకుతెలుసు.
🔺 దేవుని మనస్సు అర్థము చేసుకొనుటకు లేక  దేవుని మనస్సులో ఉన్న మాటలను నేర్చుకొనుటకు పెద్దగ కష్టపడాల్సిన అవసరత లేదు అనే భావముతో ఈనాడు ఎక్కువ మంది Christians ఉన్నారు.

👉Bible లో ఇలా( విశ్వాస మొక్కటే) ఉంటే మీరు ఏంటి అలా చేసుకుని చెబుతున్నారు అనిఅడిగితే ‘’’’ మీ విశ్వాసము మిది, మా విశ్వాసము మాది అంటున్నారు. ఇక్కడ రెండు విశ్వాసాలు వచ్చాయి. ఇంకొకడు కలిస్తే ఇంకొక విశ్వాసము. ఇలాకలుస్తూ పోతే విశ్వాసాలు కూడ పెరుగుతూ పోతాయి.
👉మనకు బైబిల్  లోని((ఎఫేసి 4:5 లో ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తీస్మం ఒక్కటే,అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే))
మాటలు అర్థము కాలేదు,
🔺 అంటే ఆ సందర్భము తెలుసుకోడానికోసము మనము కష్టపడలేదని అర్థము.
👉దేవుని వాక్యము కష్టపడి నేర్చుకోవాలి. కష్టపడి నేర్చుకున్న తర్వాతే దేవుని పనికి న్యాయము చేయగిలినవారము అవుతాము.

1⃣బైబిల్  అనగా ఏమి??

🔹Bible అను english పదము BIBLAS or BIBLIA అను greek పదము నుండి వచ్చినది.
🔹తెలుగులో పుస్తక సముదాయము అంటారు.
🔹 1600 years పాటు సుమారు 40 నుంచి 45 persons రాసారు. రాసినవారంత వేరు వేరు ప్రాంతాలకు చెందినవారు, వేరు వేరు కాలానికి చెందిన వారు, వేరువేరు వృత్తులకు చెందినవారు. వేరు వేరు అయినప్పటికీ రాసింది ఒకటే భావము.
🔹ఎందుకు అని అడిగితే... రాసింది మనుషులైన రాయించింది దేవుడే...!
👉2peter 1:20,21 లో ఒకడు తన ఊహను బట్టి చెప్పుటవలనలేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొట్టమొదట గ్రహించుకోవాలి. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదుగాని మనుష్యులు పరిశుద్దాత్మ ద్వార ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి.
👉 Zechariah(జెకర్యా) 7:12 ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను,...
* 2 Timothy(రెండవ తిమోతికి) 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి) ఉపదేశించుటకును,
👉ఎఫెసీయులకు 3:3. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.
👉Jeremiah(యిర్మీయా) 30:2,3 వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పినమాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
More supportable references ¬ (Daniel(దానియేలు) 12:4 & Hosea(హొషేయ) 12:10 )

👉అంటే రాసిన వారు దేవుని మనస్సుని తెలియచెప్పారు .వాళ్ళ సొంత మాటలు అస్సలే కావు..పై వచనములలో మనుష్యుని ఊహను బట్టి కాదని, పరిశుద్దాత్మ దేవుడు ఈ వేరు వేరు వాళ్ళందరి నోట అయన పలికించివ్రాయించాడే తప్ప ఊహను బట్టి కాదు. again - దేవుని చేత ప్రేరేపింపగా వారు రాసారు.

2⃣  బైబిల్ ని ఎలా అర్దము చేసుకోవాలి ??

👉దేవాది దేవుడు ఆదికాండము నుండి ప్రకటన గ్రంధం వరకు తన వాక్కుని ప్రవక్తలతో , యజకులతో, సేవకులతో, దేవదుతలతో & దర్శనాల ద్వారాను మనకు తెలియచేసాడు..
🔸ఆదాము నుండి నేటి మన వరకు దేవుని ఆజ్ఞలను & ప్రణాలికలను & నిభందనలను మనకు తెలియచేస్తూనే ఉన్నటు మనము గమనిస్తూనే ఉన్నాము ..
example :- mathew 6 chapter..
🔹కానీ దేవును అలా ఎందుకు నూతన పరుస్తున్నాడు?? అనేది మొదట ఆలోచించాలి.
🔹 ఒక ఉపమాన రూపములో చెప్పాలి అని భావిస్తున్నాను.. దయచేసి జాగ్రతగా ఆలోచిస్తూ చదవండి ..
ఉపమానము :-
■ అప్పుడే పుట్టిన ఒక శిశువుకి జ్ఞానం + శక్తి + సామర్ద్యముని ఆలోచిస్తే తనకు తను ఎం చెయ్యలేదు & చేసుకోలేడు . దీనిని ""ఆదాము - నోవాహు "" వరకు అని భావించండి .
■ అదే శిశువు తల్లి పాలవల్ల పొందిన శక్తి + జ్ఞానం + సమర్ద్యముతో తను ఉన్న చోటు నుండి కదలడం లేక బొర్లడం & పాకడం లాంటివి చేస్తాడు .. దీనిని ""నోవహు- అబ్రాహాము "" అని భావించండి..
■ కొంత కాలానికి తల్లి (దేవుడు) ద్వార పొందిన శక్తి + జ్ఞానం+ సమర్ద్యముతో నెమ్మదిగా నడక & మాటలను కూడా నేర్చుకున్నాడు.. దీనిని అబ్రాహాము - మోషే వరకు ..
Note:- ఈ 3 సందర్భాలను ""Acts(అపొస్తలుల కార్యములు) 17:30
ఆ అజ్ఞానకాలములను... "" లేదా పితరుల కాలము అని చెప్పవచ్చు ..
● మన పిల్లలకు మాట్లాడం & నడవటం వస్తే ఎం చేస్తాం ?? బడిలో వేస్తాం...
🔸బడిలో direct గ 9th లోనో 10th లోనో వెయ్యము కదా .. బడిలో primary sections లోనే వేస్తాం Nursery,Lkg,Ukg లో వేస్తాము ..
🔸""Galatians(గలతీయులకు) 3:24,25 ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను""
-ఈ బాలశిక్షలో ఉన్న సమయములో ఆ బాలుని mentality&mindset ఎలా ఉంటాడో మీకు తెలుసు..
🔸 అందుకే దేవుడు తన చేతితో తన పిల్లలకు దిద్దించాడు / నేర్పించాడు, ఒక teacher వలె ...
● యొహోషువ - న్యాయాధిపతులు -రాజులూ - బబులొను చేర + మాదియ పారసీకపు చేర - రెండవసారి మందిర నిర్మాణము + ప్రకారం కట్టబడటం + israel ప్రజలు అందరు తిరిగి దేశములోనికి రావటం... ఈ మొత్తంని ఆ బాలుడి బడిని పూర్తి చేసుకున్నాడు అని భావించండి.. ఆ బాలుని జ్ఞానం+ శక్తి +సామర్ద్యము ఎంతో మార్పు వస్తు ఉంటున్నాటు గమనించవచ్చు ..
● బడి అయిపోయిన తరువాత inter లోకి వచ్చాడు అనుకుంటే .. మలాకీ - మత్తయి సువార్త వరకు మద్యన సుమారు 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు.. దానిని dark piriod అని అంటారు.. ఈ time లో inter ఐపోయింది అని భావించండి .
▶ మన ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు వారు వచ్చి మూడున్నర సంవత్సరాలను ఆ వ్యక్తికి degree ల భావించండి..
🔺ఆదికాండం మొదులుకొని మలాకీ వరకు basics వస్తూనే ఉన్నాయి..
🔺కాని క్రీస్తు వారిలో సంపూర్ణతను చూడొచ్చు..
▪ LKG UKG లో చేసిన విధంగా భట్టి పట్టినటు degreeలో భట్టి పట్టటం అవసరం లేదు ..
👉Note:- ఆ బాలుడు ఎవరో కాదండి.. మనమే & జ్ఞానం+శక్తి +సామర్ద్యముల మార్పుని గుర్తు చేసున్నాను ..

🔺అంటే దేవుని పిల్లలమైన మన ఎదుగుదలని బట్టి దేవుడు మనకు food ని ready చేసి ఇస్తున్నాడు ..
ఎల్లప్పుడూ milk ఇవ్వటం coorect కాదు, అలా అని పుట్టిన వెంటనే బలమైన ఆహారం కూడా పెట్టలేము కదా...
అందుకే starting లో అందరు యాజకులు కాదు.. అందరు రాజులు కాదు.. అందరిలో పరిశుదత్ముడులేదు.. అందరు సేవలో లేరు..
But now... all r changed(1 Peter2:9)...
👉అంటే మనం క్రిస్తునందు సంపూర్ణులం ,
👉క్రీస్తు వారు ఉన్న సమయములో అన్ని చెప్పటానికి కుదరలేదు ఎందుకు అంటే వారి సామర్ద్యం సరిపోదు.
🔺యోహాను సువార్త 16:12,13 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
కాబటి..
🔺సువార్తల తరువాత అపోస్తుల సేవ & పరిశుదత్మ సహాయముతో వ్రాయబడిన పత్రికలు+ప్రకటన గ్రంధంతో ముగింపు .. ఇక్కడ చుస్తే Pg & P.Hd ని కూడా చేపించేసారు ..
అంటే masters in god's wisdom & power & holiness all are increased & devoloped too...!

👉అందుకే పరిశుదత్మలో మనం చిన్న పిల్లలం కాదు.
👉 అజ్ఞాన కాలములో లేము.. బాలశిక్షకులం కాదు..
👉ప్రతీ విషయములో సంపూర్ణులము..

🔺Basics(LKG,UKG) నుండి PG వరకు ఎంతో మారింది .. మన కాలముతో పాటు మనకు తగ్గటు దేవుడు తన ప్రణాళికను తెలియచేస్తూ వచ్చాడు.
▶ bible లో 3 కాలాలుగా భావిస్తే ..
1)అజ్ఞాన కాలము or పితరుల కాలము
2) ధర్మశాస్ర్త కాలము
3) నూతన నిభందన కాలము..

(మిగతాది రెండవ భాగములో)
----------------------------------------------------------

Comments

Popular Posts