దేవుడు ఒక్కడేనా ?

దేవుడు ఒక్కడా...??? లేక అనేకమా...???

దైవ గ్రంధాలల్లో ఏముందో తెలుసుకుందాం...!!!
మొదటగా వేదాల్లో

"ఏకం బ్రహ్మం, ద్వితీయ నస్తనెన్ ననస్తే కించన్"

అర్ధం ...

"దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, అసలు లేనే లేడు, కొంచెం కూడా లేడు.

ఇక ఈ క్రింద పేర్కొనబడిన వేదాలు, ఉపనిషత్తులు పై సూత్రానికి సజీవ సాక్ష్యాలు:

"ఏకం యెవద్వితీయం"                    (एकम यवद्वितीयम)               ఛాందోగ్య ఉపనిషత్తు (6:2:1)

"ఆయన ఒక్కడే రెండవ వాడు లేడు"

"న చస్య కశ్చిత్ జనిత నచాదిపః"   (न चास्य कश्चित् नचादिपः)   శ్వేతాశ్వతర ఉపనిషత్తు (6:9)

"ఆయన పై అధిపతులు, యజమానులు లేరు"

అని వుంది. అంటే సర్వశక్తి సంపన్నుడు అయిన దవానికి తల్లిగాని, తండ్రిగాని లేరు. ఆయనకంటే ఉన్నతుడెవరూ లేరు అని అర్ధం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు లోనే 4వ అధ్యాయము, 19వ మంత్రంలో ఇలా చెప్పబడింది.

"న తస్య ప్రతిమ ఆస్తి"                    (न तस्य प्रतिम अस्थि)         శ్వేతాశ్వతర ఉపనిషత్తు (4:19)

"ఆయనకు ఎలాంటి ప్రతిమ, ప్రతిరూపము లేదు"

"న సందృశే తిష్ఠతి రూపమస్య      ( न  सन्द्रुसे तिष्ठति रूपमस्य    శ్వేతాశ్వతర ఉపనిషత్తు (4:20)
న చక్షుసా పశ్చతికశ్చనైనమ్"     न चक्षुपा पश्चाति कस्च नैनम)

"ఆయన  రూపము ఎవరి కళ్ళలోనూ ఇమడదు, ఆయన్ని ఏ కళ్ళూ చూడలేవు"

బైబిల్ లో చూసినట్లయితే.....

"మరియు భూమిపైన ఎవరికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడేమీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు."  (మత్తయి 23:9)

మరో చోట ...

"కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు?"
(యెషయా 40:18)

నిజదేవుని రూపురేఖలను ఊహించటం మనిషితరం కాదని ఇంకో వాక్యం కుండబద్దలు చేసింది.

ఖురాన్ లో....

 "దివ్యఖుర్'ఆన్" కూడా అత్యంత సులువైన మాటల్లో దేవుని భావనను ఈ విధంగా విశదీకరించింది.

قل هو الله أحد الله اصمد  لم يلد ولم يولد

(ولم يكن له كفو أحد       (سورة الإخلاص

"ప్రవక్తా! ఇలా అను "అల్లాహ్ యే ఏకైక దైవం. ఆయన నిరాపెక్షా పరుడ. ఆయనకు సంతానము లేదు. ఆయన ఒకరికి సంతానము కాదు. ఆయనకు పోల్చదగినది ఏది లేదు".

 ఖురాన్ లో దైవాన్ని గురించి ఇవ్వబడిన 4 వాక్యాల నిర్వచనమిది.ఈ నిర్వచనంలో ఇమడ దగిన శక్తి ఏదైనా ఉంటే ఆ శక్తినే మనం దైవంగా అంగీకరించవచ్చు.

కాబట్టి అన్ని దైవ గ్రంధాల్లో దేవుడు ఒక్కడే అని ఆ దేవుడికి రూపాన్ని కల్పించి పూజించారదని ఖరాఖండిగా చెప్పబడుతోంది....

Comments

Popular Posts