బైబిల్ అంటే ఏమిటి ?

✳ బైబిల్ ✳

🔺 బైబిల్  లోని వాక్యాలను ఎలా పొందుపరిచేవారు??
🔺బైబిల్  ని ఎలా చదవాలి???...✍

3⃣ బైబిల్  లోని వాక్యాలను ఎలా పొందుపరిచేవారు??
👉అనాది కాలం నుండి పరిశీలించి ఉంటే దేవుని వాక్యంని రాతిపలకల మీద , జంతు చర్మముపై , చర్మపు కాగితములపై, చెట్ల బెరడుల, కాగితములపై రాసేవాళ్ళు ...
అలా రాసిన వాటిని next generation కి ఇచ్చే వారు లేక భద్రపరిచే వారు..
🔺 అనేక గ్రంధములు , అనేక కాలములో , అనేక వ్యక్తులతో, అనేక స్థలాలో, అనేక చెరలలొ, అనేక చారిత్రాత్మిక, అనేక సంకృతుల, అనేక భౌగోలిక, అనేక గీతాలతో (కీర్తనల& రాగముల & వాద్యముల) , అనేకమైన శాస్త్రవిజ్ఞానంతో , భూత వర్తమాన భవిష్యత్ కాలము లను , దేవుని సూచకక్రియల &మహత్కార్య ముల & అద్భుతములను చూపే& నిత్య జీవమును ఇచ్చే , & నిజమైన దేవుని ప్రేమను శక్తిను జ్ఞానమును తెలిపే ఏకైక దైవ గ్రంధమే Bible..
●Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 5:22 ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను.
●Luke 2:20 ఆయన ""గ్రంథము చుట్టి" "పరిచారకునికిచ్చి కూర్చుండెను.
●Heb 10:7 అప్పుడు నేను""గ్రంథపుచుట్టలో" "నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము,
●2 Timothy(రెండవ తిమోతికి) 4:12,13 పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
●Jeremiah(యిర్మీయా) 36:2 నీవు ""పుస్తకపుచుట్ట"" తీసికొని నేను నీతో మాటలాడిన...
చుట్టలు (Scrolls) ల ఉండేవి అని అర్దము అవుతుంది ..

🔺Johann gutenberg రావటం కేవలం bible కొరకే printing press తయారు చెయ్యడం & ప్రతీ ఒక్కరి దగ్గరకు Bible రావటం & అనేక languages లోనికి translate కావడం జరిగింది. దేవుడు తన పిల్లలమైన మన దగరకు తన మనస్సు ని bible అనే ఈ పుస్తకాల సమూహములో తెలియచేసేసాడు .. మరి ఇంత చేసిన దేవుడు ఒక్కటి కోరుతున్నాడు ...
★》2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:2,3 మా హృదయముల మీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా? రాతిపలక మీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయైయున్నారని మీరు తేటపరచబడుచున్నారు...
ఈ చివరి వచనాలను మల్లి మల్లి చదవి దేవుని కోరికను దయచేసి అర్ధం చేసుకోవాలి అని కోరుతున్నాను దేవుని ప్రియులారా ...

4⃣ బైబిల్  ని ఎలా చదవాలి???
◆ రోజుకు ఒక వచనం లేక రోజుకు ఒక అధ్యాయంని మొక్కుబడిలా చదివితే Bible ఎప్పుడు అర్ధం కాదు.. మన లోకవిద్య కొరకే ఎన్నో గంటలు సంవత్సరాలు ఖర్చు చేస్తాము..
👉 మరి దేవుని విషయములో మరి ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి ...
అందుకే దేవుడే చెప్పిన పద్ధతిని తెలుసుకుని చదువుద్దము .
▪Isaiah(యెషయా గ్రంథము) 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి.

▪John(యోహాను సువార్త) 5:39 లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు( లేక, పరిశోధించుండి).
▪Acts(అపొస్తలుల కార్యములు) 17:11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి...

🔹అంటే "పరిశోధించుచు చదవాలి" అని అర్ధం ఐంది..
🔹 అసలు ఎందుకు పరిశీలించాలి??
🔹ఎలా పరిశీలించాలి??
🔹 దేవుడు ఎం చెప్పుతున్నాడు??
▪Isaiah(యెషయా గ్రంథము) 28:13 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును...
→"కొంత ఇచ్చట కొంత అచ్చట" అది ఎలా.?
-మనం చదివిన దేవుని వాక్యం ప్రకారం వాక్యం ని పరిశోదిస్తూ పరిశీలించాలి అని అర్ధం అవుతుంది .
👉 కాని ఎలా ??
◆ ఒక example》
➡ ""ఆమెన్ "" అనేది తెలుసుకుంటూ ముందుకు వెలద్దాము ..
▪Jeremiah(యిర్మీయా) 11:5 అందుకుయెహోవా, ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని(ఆమెన్ ).
ఒకే మాటే కానీ అన్ని చోట్ల ఒకే అర్ధం మాత్రం రాదు .. "ఆమెన్" అను మాట దేవుని దివ్య దైవ గ్రంధంలో 4 రకాలు భావాలతో ఉదేశాలతో వ్రాయబడింది ..
☆ఒక విషయం చెప్పమంటారా ?
🔺Amen అను ఈ మాటను అర్దరహిథముగ గాని, సందర్భారహితంగ గాని , దేవుని చిత్తానికి వ్యతిరేకంగ గాని చెప్పవొ శిక్షకు పాత్రులము అవుతాము
🔸 1st type Amen》blessings & desires & మంచి జరగాలి అని & దేవుని చిత్తం నెరవేరాలని కోరుతూ Amen అంటాము.. ఇది సరైనది..
ఫిలిప్పీ యులకు 1:19,20 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రియైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.
🔸2nd type Amen》 commitment&conformation దేవుని చట్టం & దేవుని శాశనం జరగాలని ఎదుటివారి ప్రార్ధన నెరవేరాలని కోరుకునేది. కానీ మనలో అనేకులు ప్రార్ధన చేస్తుంటే చివరిలో వచ్చి "" క్రీస్తు వారి నామములో ప్రార్ధిస్తున్నాను తండ్రి ఆమెన్ "" అంటాడు కానీ ఆ prayer లో ఉన్న matter తెలియదు & ఆ prayer వినలేదండి , ఒక వేల prayer చేసిన వారికీ దేవుని గూర్చి & దేవుని తలంపులు తెలియక తప్పుగా prayer చేసాడు అనుకోండి --- అంటే మీరు ఆ తప్పు కొరకే ఆమెన్(ఆలాగున జరుగును గాక ) అని చెప్పి మీరు కూడా ఎకిభావించారు .. మనలోనే కొందరు తప్పుగా Amen ని వాడుతున్నారు .. దేవుని వాక్యంని వ్యర్ధంగా చెప్పటం కూడా పాపమే ..ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఈ విధంగా పాపగా ఎందుకు ఎంచ్చబడాలి.
Note :- Amen అనేముందు జాగ్రత్తగా ఉండండి .. Please.
Numbers(సంఖ్యాకాండము) 1:11-22-31
Numbers(సంఖ్యాకాండము) 1:11-28

👉ఈ రెండు చోట్ల శాసనముగా దేవుని మాట వస్తుంటే , ఆ మాటకు మేము అవిధేయత చూపితే శాపము రావాలని కోరుతున్నాటు Amen అనటం జరిగింది ..
🔸 3rd type Amen 》 ఇది నిశ్చ్చయం , ఇది నిజం (సత్యమైనది & నమ్మదగినది ) అను భావం వస్తుంది.
Matthew(మత్తయి సువార్త) 6:13 (కొన్ని ప్రాచీన ప్రతులలో-రాజ్యము, బలము, మహిమయు నీవైయున్నవి, ఆమేన్, అని కూర్చబడియున్నది) & Romans(రోమీయులకు) 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్...
ఈ రెండు చోట్ల "ఆలాగున జరుగును గాక" అన్నారో అర్ధమే దొరకకుండా, లేకుండా అయిపోతుంది . ఇక్కడ Amen అను మాటను
👉""ఇది సత్యం"" అని చెప్పటం కొరకు వాడటం జరిగింది ...
🔸4th type Amen》 మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారికీ Bible లో ఎన్నో నామములతో పిలవబడడు.. ex:- ఇమ్మనుయెలు ,వాక్యం, వెలుగు , సత్యం , జీవం , జ్ఞానం , రాజులకు రాజు & ప్రభువు లకు ప్రభువు etc etc.) ప్రతి నామములో క్రీస్తు వారి లక్షణం (character) ని చూడవచ్చు .యేసు క్రీస్తు వారి పేరు "Amen"
Revelation(ప్రకటన గ్రంథము) 3:14
👉 ""ఆమేన్ అనువాడును"" నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా...
అంటే మొదటి రెండు సందర్భాలు "అలాగున జరగాలి" అని అర్ధం వస్తే , చివరి రెండు ""సత్యం, వాక్యం , క్రీస్తు"" వారిని చూపిస్తుంది..
దీనిని వాక్య విభజనగా చెప్పవచ్చు(2Timothy(రెండవ తిమోతికి) 2:15 సత్యవాక్యమును సరిగా విభజించు వానిగాను)..
&
మనలో అందరిలో ఉద్యోగం & విద్యాభ్యాస ము చేసిన వారు ఉంటారు..
▪మనం నిరంతరం ఒకే తరుగతిలో గాని ఒకే స్తాయిలో ఉండాలి అనిగాని, ఒకే జీతానికి చెయ్యాలని అనుకోము..
▪day by day development కావాలని కోరుతూ ముందుకు వెళ్తాము..
🔺 అలాగే Bible ని చదివే వారు కూడా ఒకటి తెలుసుకోవాలి.. అదేంటి అంటే??
🔹examples:-

👉ప్రేమ (Love):-
(పొరుగువని విషయములో )

🔹1st step- మన సొంత వారిని ప్రేమిస్తాం ( లూకా 6:32)
🔹2nd step- శత్రువుని కూడా ప్రేమిస్తాం ( లూకా 6:27,28)
🔹3rd step- ప్రేమ సమస్త పాపముని కప్పును (సామెతలు 17:9 ,సామెతలు 10:12) & (1పేతురు 4:8)
🔹4th step- సంపుర్నమైన ప్రేమ క్రీస్తు వారి వాలే తన ప్రాణ ము నే త్యాగం చేస్తుంది .. (1 యోహాను 3:16)

👉విశ్వాసం(faith):-

🔹1st step- వినుట వలన విశ్వాసం కలుగును.. (రోమా 10:17)
🔹2nd step- ఆవగింజంత ఉంటే చాలు (లూకా 17:5,6)
🔹3rd step- ఆవగింజ భూమిలో పడి చచ్చి మహావృక్షంగ రావాలి (మార్కు 4:30-32 & మత్తయి 17:20)
🔹4th step- సంపూర్ణ మైన విశ్వాసము ... (యాకోబు 2:5,14,22 & 2 థెస్సలొనీకయులకు1:11,12 )

👉రక్షన (Salvation):-
🔹1st- యేసు క్రీస్తు అని నమ్మినవాడు రక్షింపబడును (rom 10:9)
🔹2nd- క్రీస్తు వారి నామములో ప్రార్ధన చేయువాడే రక్షింపబడును.. (rom 10:13)
🔹3rd- నిజంగా నమ్మితేనే baptism తీసుకుంటాడు, baptism తేసుకున్నవారు రక్షింపబడును (mark16:16)
🔹4th- Matthew(మత్తయి సువార్త) 24:13 అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.

🔺Bible ని చదివే మనం మన బ్రతుకుని దేవునిలో develop అయ్యేలా చదవాలి..
🔺 దేవునిలో development నే ఆత్మీయత అని అంటారు..
🔺 మనమే క్రీస్తు వారికీ పత్రికల మారాలి..
🔺అలా జరగాలి అంటే దేవునిలో సంపూర్ణతను పొందుకోవటం కొరకు సాగిపోవలె గాని ఉన్న స్తితిని చూచి అతిశాయపదకూడదు.. ఖచ్చితంగా సంపూర్ణలు కావాలి ప్రియ సహోదరులారా..
🔺 దేవునికి దగ్గరకావాలని కోరుతూ ఆశతోనే చదవలే కానీ వాగ్దానాల కోరకో భంగారు వాక్యల కోరకు చద వ కం డి/ చదవకూడదు ..
దేవుని పిల్లలమైన మనకు ఇప్పటికే ఒక విషయం అర్ధం ఐపోయి ఉంటుంది ...

▪Isaiah(యెషయా గ్రంథము) 28:13 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.
↑ పైన చెప్పిన రెండు (1.Amen & 2. ప్రేమ విశ్వాసం రక్షణ) రకాల ఉదాహరలతో చెప్పడం జరిగింది ..
"కొంత అచ్చట కొంత ఇచ్చట"
🔺 అనేది మొత్తం Bible గూర్చి మాత్రమే గాని వేరే వారి గ్రంధాల గూర్చి కాదండి ,
🔺 దయచేసి Bible లోనివి కాకుండా బయటి గ్రంధాలలోనివి తెచ్చి భినమైన సువార్త చేయకండి / చెయ్యకూడదు ..
అలాగే చివరిగా ఒక్క విషయం తెలుసుకొని ముగించుకుందాం ..

5⃣ బైబిల్  ని చదివే వారు ముఖ్యం 3 rules ని పాటించాలి ..
1) Time Factor
2) Context Factor
3) Language Factor
👉Time Factor లో చుస్తే మనం చదివిన వాక్యం ఏ కాలము / సమయమును తెలియచేస్తుందో పరిశీలించాలి .. కొన్ని సందర్భాలు రెండు మూడు కాలాలను చెప్పేల ఉండటం జరుగుతుంది .. ( 1 Peter1:10,11 & mathew23:29-39 & ezekiel44:24 & Acts3:21,22)
ఈ వాక్యాలను Bible లో చుడండి కాలముతో పాటు మనం నేర్చుకునేది కూడా అర్ధం అవుతుంది (★★ Joshua 10:12-13 diff b/w Ephesians 4:26★★) ...!

👉Context Factor ని చుస్తే
▪"" ఎవరు మాట్లాడుతున్నారు?? ""
▪"" ఎవరితో మాట్లాడుతున్నారు? ""
▪"" ఎవరి గూర్చి మాట్లాడుతున్నారు ?? ""
అనే ఈ 3 ఖచ్చితంగా అర్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ..
(Acts 8:34,35 & Heb 12:14-17 )

👉 language Factor ని చుస్తే Matthew 13 chapter ని గమనిస్తే పరలోకపు రాజ్యంని ఒక మనుష్యుడు విత్తనములు , ఆవగింజ , పుల్లని పిండి , పొలములో దాచబడిన ధనము , సముద్రములోని చేప etc.. ఇక్కడ పోలికలను ప్రయోగింపబడిన భాషను కాక భావనే తీసుకోవాలని కోరుతున (bhavamu = Matthew9 :13 & 12:7, Luke24 :27, Daniel5:24,25)
దేవుని వారసులార..
🔺ఇదంతా చెప్పటానికి కారణం ఏమంటార ??
🔺 సాతనుకి దేవుని వాక్యం బాగా తెలుసండి ..
🔺ఆ దుష్టుడు ఆ అపవా ది అబద్ధికుడు అనుక్షణం దేవుని పిల్లలమైన మనలందరిని మోసపరచాలని చూస్తున్నాడు,
🔺ఎటు చేసి దేవుని పిల్లలమైన మనలను
భందించి చెరపట్టి పరలోకానికి వేల్లనివకుండా చెయ్యాలని ప్రయత్నిస్తుంది ..
🔺దేవుని గూర్చి & పరలోకం గూర్చి ఆలోచించకుండా చేసేస్తుంది ..
👉ఇది చాలదు అన్నటు అనేక రకాలైన తప్పుడు doctrines/ సిద్ధాంతాలను రప్పించి సత్యం ఏదో అసత్యం ఏదో తెలియనీయకుండా చేసేసింది ...
👉అందుకే Bible study గూర్చి ఒక చిన్న సమాచారం ఇవ్వడం జరిగింది .. ఇంతే కాదు ఎంతో చెప్పేది ఉంది, కాని అదంతా చెప్పటానికి ఈ Facebook & మన జీవితం రెండు సరిపోవు ..
2 Peter(రెండవ పేతురు) 3:15,16,17,18
మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు(వక్రముగా త్రిప్పుదురు).
ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక.
ఆమేన్...

👉చివరిగ ఒక్కటి ఆలోచించండి.. పేతురు లాంటి భాక్తిపరులకే వాక్యములోని కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైతే ,
👉పేతురు లాంటి వారే వాక్యాన్ని అర్ధం చేసుకోటానికి కష్టపడుతుంటే ఇక మనం ఇంకెంత కష్టపడాలో అని ఆలోచించండని కోరుకుంటున్నాను .

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 13:13,14 పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.
ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్

----------------------------------------------------------

Comments

Popular Posts