బలిపీఠములు

బలిపీఠములు
******
బైబిలు నందు మొత్తము 4 రకముల బలిపీఠములు కలవు
1. మట్టితో చేసినవి
2. రాళ్లతో చేసినవి
3. చెక్కను ఇత్తడితో తాపడము చేసినవి
4. చెక్కను బంగారముతో తాపడము చేసినవి
బైబిలు నందు మనుష్యుల చేత కట్టబడిన బలిపీఠములు
1.నోహహు చేత కట్టబడినది
a.అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.  (ఆదికాండము 8:20)
2.అబ్రహాము చేత కట్టబడినవి
a.షెకెము నందు
i.యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక  బలిపీఠమును కట్టెను. (ఆదికాండము 12:7)
ii.అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను  గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్ధన చేసెను. (ఆదికాండము 12:8)
b.హెబ్రోను నందు
i.అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోను లోని మమ్రే దగ్గరనున్న సింధూరవృక్షవన ములోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును  కట్టెను. (ఆదికాండము 13:18)
c.మోరియా పర్వతము మీద
i.ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన  కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. (ఆదికాండము 22:9)
3.ఇస్సాకు చేత కట్టబడినది
a.అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.  (ఆదికాండము 26:25)
4.యాకోబు చేత కట్టబడినది
a.షెకెము నందు
i.అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌  ఎలోహేయి  ఇశ్రాయేలు  అను  పేరు పెట్టెను. (ఆదికాండము 33:20)
b.బేతేలు నందు
i.అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి  ఏల్‌ బేతేలను పేరుపెట్టిరి. (ఆదికాండము 35:7)
5.మోషే చేత కట్టబడినది
a.తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి (నిర్గమకాండము 17:15)
6.బాలాకు చేత కట్టబడినది
a.అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.  (సంఖ్యాకాండము 23:1)
b.పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.  (సంఖ్యాకాండము 23:14)
7.యెహోషువ చేత కట్టబడినది
a.యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు  తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి. (యెహోషువ 8:31)
8.యోర్దానునకు తూర్పున ఉన్న గోత్రముల వారు కట్టినది
a.రూబేనీయులును గాదీయులును మనష్షే అర్థ గోత్రపువారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠ మును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. (యెహోషువ  22:10)
9.గిద్యోను చేత కట్టబడినది
a.అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.  (న్యాయాధిపతులు 6:24)
10.మానోహ చేత కట్టబడినది
a.అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత  యొక ఆశ్చర్యకార్యము చేసెను. (న్యాయాధిపతులు 13:19)
11.ఇశ్రాయేలీయులు చేత కట్టబడినది
a.మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధానబలులను అర్పించిరి. (న్యాయాధిపతులు 21:4)
12.సమూయేలు చేత కట్టబడినది
a.మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక  బలిపీఠము కట్టెను. (1సమూయేలు 7:17)
13.సౌలు చేత కట్టబడినది
a.మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. (1సమూయేలు 14:35)
14.దావీదు చేత కట్టబడినది
a.అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన  విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను. (2సమూయేలు 24:25)
15.యెరోబాము చేత కట్టబడినది
a.ఈ ప్రకారము అతడు యోచించినదానినిబట్టి యెనిమిదవ  మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలి పీఠముమీద బలులు  అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రాయేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయు టకై తానే బలిపీఠము ఎక్కెను. (1రాజులు 12:33)
16.ఆహాబు చేత కట్టబడినది (బయలునకు)
a.షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. (1రాజులు 16:32)
17.ఏలియా చేత కట్టబడినది
a.ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి (1రాజులు  18:32)
18.ఊరియా చేత కట్టబడినది
a.కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన  ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు  దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను. (2రాజులు 16:11)
19.మనష్షే చేత కట్టబడినది (బయలునకు)
a.తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలురాజైన అహాబు  చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను. (2రాజులు 21:3)
20.జెరుబ్బాబెలు చేత కట్టబడినది
a.యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి,  దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పిం చుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.  (ఎజ్రా 3:2)

Comments

Popular Posts