బైబిల్ లో స్నేహితులు
బైబిలు లో స్నేహితులు
----- ---------------
స్నేహము అనే మాట మంచి మాట బైబిలు ఈ విషయమును ధృవపరుస్తున్నది..
బైబిలు లో మంచి స్నేహితులుగాకొందరు మనకు కనబడుచున్నారు .
వారిని గూర్చిన కొన్ని ప్రశ్నలు సమదానములు.
1.దావీదు తర్వాత సొలోమోను రాజైన పిదప కూడా అదే స్నేహము కొనసాగించిన రాజు ఎవరు? (1రాజులు 5:1)
జ :- *హిరాము*
2.యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఏ ఇశ్రాయేలు రాజుతో స్నేహము చేసెను? (2దినవృత్తాంతములు 20:35)
జ:- *అహజ్యతో*
3.స్నేహము చేయుట, ద్వేషించుట మనుష్యులవశము లో లేదని కనుగొని పరిశీలనగా మనస్సు నిలిపిన రాజు ? (ప్రసంగి 9:1)
జ:- *సొలొమోను*
4.లోకసంబంధులను లోకము స్నేహించును అనినదెవరు? (యోహాను 15:19)
జ:- *యేసు*
5.ఇహలోక స్నేహములో పడిపోయి పౌలును విడిచి పెట్టి థెస్సలోనికయకు వెళ్లిపోయిన వ్యక్తి?(2తిమోతి 4:10)
జ:- *దేమా*
6.లోక స్నేహము ఎవరితో విరోధము ?(యాకోబు 4:4)
జ:- *దేవునితో*
7.దేవునికి స్నేహితుడు గా పిలువబడిన వ్వక్తి?( యాకోబు 2:23)
జ:- *అబ్రాహము*
8.ఒక మనిషి స్నేహితునితో మాటలాడి నట్లుగా దేవుడు ఎవరితో మాటలాడెను?(నిర్గమ33:11)
జ:- *మోషే*
9.యోబు స్నేహితులు ఎన్నిదినములు యోబుతో ఓదార్చుచు నేలమీద కూర్చుండి రి? (యోబు 2:11-13)
జ:- *ఏడు దినములు*
10.యోబు ఎవరి నిమిత్తమై ప్రార్థించినపుడు తన క్షేమస్థితి మరలా పొందెను (యోబు42:10)
జ:- *స్నేహితుల నిముత్త౦*
11.నిజమైన స్నేహితుడు దుర్థశలో ఎలామారిపోతాడు?(సామెతలు 17:17)
జ:- *సహొదరుడుగా*
12. దావీదు ప్రాణ స్నేహితుడు గా ఎవరిని భావించెను?(1సమూయేలు 18:1)
జ:- *యోనాతానును*
Comments
Post a Comment