💠💠 పరిశుద్ధ గ్రంథ ధ్యానము 💠💠

                  💠పరిశుద్ధ గ్రంధ ధ్యానము💠
     

⬛ దేవుని వాక్యము హృదయమును సంతోషపరచును.

⬛ యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి
      హృదయమును సంతోషపరచును.
                                            ⚫ కీర్తనలు 19:8

⬛ మనిషి అనునిత్యం ప్రయాసపడేది దేనికోసం అంటే?
      తాను సంతోషంగా వుండడం కోసమే.
      అతడు చేసేపని ఇతరులకు వేదన కలిగించేదిగా   
      వున్నా, తన సంతోషం కోసం ఏదైనా చెయ్యడానికి 
      సిద్ధపడతాడు.

⬛ ఈలోకంలో ఎన్నో సంతోషాలున్నాయి.
      కానీ అవేవి సంతోషాలు కావు.
      అవి శాశ్వతమైనవి కాదు సరికదా,
      వాటి గమ్యం శాశ్వతమైన దుఃఖంలోనికి నడిపిస్తాయి.

⬛ శాశ్వతమైన సంతోషం ఈ లోకంలో ఏదైనా వుంది
      అంటే?
      అది దేవుని వాక్యం చదవడం, వినడం,
      గైకొనడం ద్వారానే సాధ్యం.

⬛ మనుష్యుల మాటలు సంతోషాన్నిచ్చినా? అది   
      తాత్కాళికమే.
      దేవుని మాటలు శాశ్వతానందాన్ని
      ఇవ్వగలవు.

🔷  దావీదు దేవుని వాక్యమును నిత్య స్వాస్థ్యముగా
      భావిస్తున్నాడు.
      కారణము? దేవుని వాక్యము అతని
      హృదయానికి ఆనందం కలిగించింది.

🔘 నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి
      నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.
                                               ⚫కీర్తనలు 119:111

⬛ విలపించే ప్రవక్తగా పేరుపొందిన యిర్మియా సహితం
      చెప్పగలుగుతున్నాడు. దేవుని మాటలు నా
     హృదయానికి ఆనందమునుకలుగజేస్తున్నాయని.       

⬛ నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు
      ఆనందమును కలుగజేయుచున్నవి*.
                                                 ⚫యిర్మియా 15:16

⬛ ఇట్లాంటి సంతోషం మనలో ఎందుకు లోపించింది?
      హృదయానికి ఆనందాన్నిచ్చే పరిశుద్ధ గ్రంధాన్ని
      ధ్యానించడం మానుకున్నామేమో?

⬛ ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, 
      సరిచేసుకొని, అనుసరించగలిగితే?
      ఆ వాక్యము నీకు హృదయానందాన్నిస్తుంది! 
      నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది!  ప్రోత్సహిస్తుంది!  
      జీవింపజేస్తుంది!
      ఆ నిత్య రాజ్యానికిచేర్చగలుగుతుంది.

🔷 ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
      అట్టి రీతిగా జీవిద్దాం!

🔷 అట్టి కృప, ధన్యత దేవుడు మనకు 
       అనుగ్రహించునుగాక!

                💠ఆమెన్! ఆమెన్! ఆమెన్!💠

Comments

Popular Posts