క్రీస్తు బిడ్డగా నూతన జన్మ

👑 మనం దేవుని బిడ్డలం. . . .

" మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. "
(రోమీయులకు) 8:16)

👉 కొంతకాలం ముందు ఒక దైవజనుడు ఉండేవారు అయన తన వృధ్యాప్యంలో కూడా ఎంతో ఉత్సాహంగా దేవుని పరిచర్య చేసేవారు.
👉 ఆ దైవజనుడికి ఎవరు కనిపించినా వారు తనకి కొత్త వారు ఐనాసరే వారి దగ్గరికి వెళ్లి " నువ్వు దేవుని బిడ్డవేనా....?" అని అడిగేవారు.
👉 ఆ ప్రశ్న విన్న వారిలో చాలామంది 'ఈ ప్రశ్న అడగటానికి నువ్వు ఎవరివి ' అని వెళ్ళిపోయేవారంట,
👉 మరికొందరు చిరునవ్వుతో ' అవును; నేను దేవుని బిడ్డనే' అని సమాధానం చెప్పేవారు.
👉 మరికొందరు మాత్రం ' నేను మంచి క్రేస్తవునిగా జీవించుటకు ప్రయత్నంచేస్తున్నాము' అని సమాధానం చెప్పేవారు.

🎯 ఎవరు ఏ సమాధానం చెప్పినా సరే ఈ దైవజనుడు మాత్రం తనకి కనిపించిన ప్రతి వారిని ఈ ప్రశ్న అడిగేవారు. . . .

👉 ఒకసారి ఒక యవ్వనస్తుడు ఈ దేవజనుడి దగ్గరకి వచ్చి... Sir మీరు ఎందుకు అందరిని ఇలా అడుగుతారు ? ఎందుకు ? అని అడిగాడు....
👉 అప్పుడు ఆ దైవజనుడు "ఎవరేనా నేను దేవుని కుమారుడిని, కుమార్తెను అని ఖచ్చితంగా చెప్పటానికి ఆలోచిస్తుంటే,
సందేహిస్తుంటే వారు;
వారిని వారే 'దేవుని బిడ్డగా' ఒప్పుకోలేకున్నారు అని అర్ధం, దానికి కారణం వారి మనసాక్షి వారిపై నేరము చూపటమే. అంటే వారు రక్షించబడి కూడా ఇంకా ఆ పాపభారం వారే మోస్తున్నారు అని అర్ధం" అని చెప్పారు

➡ నా ప్రియ స్నేహితులారా.... గమనించండి. . . .

👉 మేము క్రైస్తవులం అనే ప్రతివారు దేవుని బిడ్డలు కాలేరు
👉 బైబిల్ పేరు పెట్టుకోవటం,  👉 మందిరానికి వెళ్లి రావటం, 👉 కానుకలు,
👉 దశమభాగాలు ఇవ్వటం,
👉 భక్తి చేయటం,
👉 దానధర్మాలు చేయటం వల్ల ఎవ్వరు దేవుని బిడ్డలుగా మారలేరు. . . .

🌼 నీకోదేము మీకు గుర్తున్నాడా. . . . ?
నీకోదేము మంచి పేరు గలవాడే, మందిరానికి వెళ్తుంటాడు, భక్తిపరుడే, నీతిపరుడే అంతకుమించి "నీకోదేము ఇశ్రాయేలీయులకు భోదకుడు ధర్మశాస్రంలో ప్రవీణుడు"
👉 అయినా దేవుని బిడ్డగా ఎలా మరలో తెలియలేదు అతనికి....
👉 దేవుని బిడ్డలది అయిన ఆ పరలోకం ఎలా చెరలో తెలియలేదు అతనికి ....
📖 నూతనపరచబడితేనే దేవుని బిడ్డలం, దేవుని రాజ్య వారసులం అవుతం అని "యేహేజ్కేలు 36:26" లో ఈ నీకోదేము చదువుకున్నాడు కానీ అది అతనికి అర్ధంకాలేదు.
👉 మనస్సు నూతనపరచబడలి, 👉 మనసాక్షి నూతనపరచబడలి అది చేయకుండా ...
👉 స్వనీతివలన,
👉 భక్తి క్రియల వలన ఎవ్వరు కూడా దేవుని బిడ్డలుగా మారలేరు.

అవును. . . .

🌼 ఆదాము, హవ్వ కూడా తమ దిగంబరత్వమును కప్పుకోనుటకు ముందు వారికోసం వారే అంజూరపు ఆకులతో ఏవో ఏవో ప్రయత్నాలు చేసారు కానీ దేవుని ముందుకు రాగలిగారా....? ఆ ఆకులు వారి శరీరం మీద వున్నా వారు దేవుని ముందుకు రాలేకపోయారు.

🌼 మనుషుల స్వనీతి క్రియలు, నామకార్ధ భక్తి క్రియలు కూడా ఏందుకూ పనికిరాని ఆ అంజూరపు ఆకులవంటివే. . . .

👉 నీకోదేము తెలుసుకున్నారు. . . .ఒకరు క్రోతగా జన్మిస్తేనేగాని దేవుని రాజ్యములో చేరలేరని, దేవుని బిడ్డగా మరలేరని.

👉 మనిషి కొత్త కొత్త విధాలలో భక్తి చేయటం కాదు; మనిషి కొత్తగా మరలి. అప్పుడే దేవుని బిడ్డలుగా మారతారు.
మరి....
👉 నువ్వు దేవుని బిడ్డవేనా. . . ?
" అవును " అని నీ మనసాక్షి గట్టిగా చెప్పగాలుగుతుందా.

👉 ఈ ప్రశ్నకి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో ఏమని సమాధానం చెపుతున్నారు. . . .

👉 నేడే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్న నూతనమైన క్రెస్తవజీవితంలోకి అడుగులు వేద్దాం. రండి...

🙏 మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులవారి గూర్చిన ఈ సువార్త ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక. ఆమేన్.

Comments

Popular Posts