ప్రత్యక్ష గుడారం
ప్రత్యక్షపు గుడారము గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
ప్రత్యక్షపు గుడారము గురించి బైబిల్ లో చాలా అధ్యాయాలలో రాయబడింది. ఎంతో ప్రాముఖ్యమైనది గనుక పరిశుద్దాత్మ దేవుడు ఈ అంశాన్ని అనేకసార్లు ప్రస్తావించాడు. యింత సవిస్తరంగా వివరించిన ప్రత్యక్షపు గుడారము నిర్మాణం గురించి, అందులో అర్పించే బలులు, అర్పణలు గురించి చాలా మంది చదవరు. ఈ తెరలు ఏంటి? ఈ పలకలు, దిమ్మలు, స్తంభాలు, అడ్డకర్రలు, వంకులు, పెండేబద్దలు అసలు యివన్నీ ఏంటి అని, వీటితో ఏమి అవసరం అని పేజీలు తిప్పేస్తుంటారు... యింకా యౌవనస్తులు అయితే బైబిల్ చదువుతున్నప్పుడు ఆ కొలతలు, ఆ మూరలు రాగానే ఏమి కొలతలురా నాయనా అని ఫాస్ట్ ఫాస్ట్ గా చదివేసుకొంటు వెళ్తుంటారు. (పేపర్స్ లో వచ్చే పజిల్స్ ని జెనరల్ ఇంటలిజెన్స్ కి సంబంధించిన లెక్కలని మాత్రం బాగా చేస్తారు. బైబిల్ లో దేవుడు రాయించిన లెక్కలు గురించి మాత్రం ఆలోచించరు)
పరిశుద్ద గ్రంధమంతటిలో ప్రత్యక్షపు గుడారము అంత వివరణ ఏ ఒక్క అంశము మీద కూడా రాయబడలేదు. దేవుని పిల్లలు ఈ అంశాన్ని మనసు పెట్టి (శ్రద్ధతో) చదవకపోవడం చాలా విచారకరమయిన సంగతి. ప్రత్యక్షపు గుడారము గురించి చదువుతున్నప్పుడు ఆ ఉపకరణాలు, ఆ కొలతలు, ఆ నిర్మాణం, ఆ బలులు - అర్పణలు, యాజకుని సేవా ధర్మాలు మనకు అనవసరం అనిపించినప్పటికీ 2 తిమోతి 3:16 ప్రకారం దైవవేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కదా....
కొంతమంది పాత నిబంధన అవసరం లేదు అనుకొంటూ ఉండొచ్చు. కానీ, పాత నిబంధన లో రాసిన సంగతులని మనకు బుద్ది కలుగుటకై రాయబడినవి అని మర్చిపోకండి సుమా. (రోమా 15:4; 1 కొరింథీ 10:6). పైగా ప్రత్యక్షపు గుడారము కొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రిక లో రాయబడింది. ఈ పత్రిక అర్థం కావాలంటే నిర్గమ, లేవి, సంఖ్యాకాండాల మీద అవగాహన ఉండాలి.
పరిశుద్దాత్మ దేవుడు ఈ అంశాన్ని కొత్త నిబంధనలో కూడా రాయించాడు అంటే సంఘానికి ఏదో నేర్పించాలి అనేగా? వ్యర్థంగా ఏది రాయించడు అని ప్రతీది మన ప్రయోజనం కొరకే అని 2 తిమోతి 3:16 వచనంలో చూసాముగా. మరి యింత సవిస్తరంగా రాయబడిన అంశం గురించి మీరు తెలుసుకోవాలని ఆశ పడుతున్నారా? ఒకవేళ యింతవరకు నిర్లక్ష్యం చేసి ఉంటె యిప్పుడైనా శ్రద్ధ పెట్టి చదవండి. మీ కొరకు మీకు అర్థం అవ్వులాగున చాలా క్లుప్తంగా "ప్రత్యక్షపు గుడారపు మందిరం" గురించి, అందులో ఉన్న మర్మములు, ఆధ్యాత్మిక విషయాలు మీకు తెలియచేస్తాము. చాలా పెద్ద అంశము కనుక ప్రతి దినము ఒక భాగముగా ఈ పేజిలో (Telugu Christian Messages Page) లో వివరిస్తాము. వాటిని చదవండి, నోట్ చేసుకోండి... మీరు ఈ అంశాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక మేలులు పొంది, దేవుని స్తుతించాలని ఆశ పడితే Telugu Christian Messages Pageని ఫాలో అవ్వండి. మీతోటి స్నేహితులకు కూడా తెలియచేయండి. Thank U
"యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు." కీర్తనలు 1:2
Comments
Post a Comment