పాత నిబంధనలో కొనియాడబడిన స్త్రీలు
పాత నిబంధనలో కొనియాడబడిన స్త్రీలు
__________________________________
1 ) భర్తకు లోబడి జనములకు తల్లి అయిన శారా (1 పేతురు 3:6; ఆది 17:8)
2 ) దేవుని మహా కృప పొంది జీవం గల ప్రతివానికి తల్లి అయిన హవ్వ. (ఆది 3:20)
3 ) మనుషులచే ద్వేషించడినప్పటికీ దేవునిచే ప్రేమించబడి యూదా వంశమునకు తల్లి అయిన లేయా (ఆది 29:30-35)
4 ) పిల్లల కొరకు అంగలార్చి సంతానం పొందుకొన్న రాహేలు, హన్నా (ఆది 30:22; 1 సమూయేలు 1:10,20)
5 ) తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగి ఆశీర్వదించబడిన నయోమి (రూతు గ్రంధం)
6 ) దేవునికి ఇచ్చి రెండంతలుగా దీవించబడిన హన్నా (1 సమూయేలు 2:20)
7 ) భక్తి గల దైవజనుడికి ఆతిద్యమిచ్చి “ఘనురాలుగా” పిలువబడిన షూనేమీయురాలు (2 రాజులు 4:8)
8 ) వేశ్య అయినప్పటికీ విశ్వాసముచే రక్షింపబడిన రాహాబు (హెబ్రీ 11:31)
9 ) దేవుని చిత్తమునకు లోబడిన రిబ్కా (ఆది 24వ అధ్యాయం)
11 ) అత్తను ప్రేమించి, దేవుని చెంతకు వచ్చి ఆశీర్వదించబడిన రూతు. (రూతు గ్రంధం)
12 ) తన భర్తను రక్షించుకొనుటకు సుబుద్ధి చూపించి ఆశీర్వాదం పొందిన అబీగయీలు (1 సమూయేలు 25:33)
13 ) దేవుని మీద నమ్మకంతో ధైర్యముగా యుద్ధాన్ని నడిపించిన స్త్రీ దెబోరా (న్యాయాధిపతులు 4:4-14)
14 ) కుమారుడికి దేవుని మాటలు ఉపదేశించిన లెమూయేలు తల్లి (సామెతలు 31వ అధ్యాయము)
15 ) దైవజనుడిని పోషించి కరువులో సమృద్ధిని రుచి చూసిన సారెపతు విధవరాలు (1 రాజులు 17:8-24)
16 ) సందేహములు తీర్చుకొని దేవుని స్తుతించిన షేబ దేశపు రాణి (1 రాజులు 10:9)
17 ) ప్రవక్త్రిలుగా పిలువబడిన కొంతమంది స్త్రీల పేర్లు
e) నోవద్యా (నెహెమ్యా 6:14, చెడ్డ ప్రవక్త్రి)
g) తుయతైరలో అబద్ద ప్రవక్త్రి (ప్రకటన 2:20, ఇక్కడ యెజెబెలు అనే పేరు ఉపమానరీతిగా వాడి ఉండొచ్చు.)
జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడబెరుకును. (సామెతలు 14:1)
గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. (సామెతలు 31:10)
జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి. (1పేతురు 3: 3-
Comments
Post a Comment