💠ఆదికాండము వచన వివరణ💠

ఆదికాండము 1:1

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను

                           💠వ్యాఖ్యానము💠

🔷 విశ్వము యొక్క ఆరంభము గురించి లోకములో ఎన్నో
      సిద్దాంతములు ఉన్నాయి. వాటి అన్నింటికీ కూడా
      దేవుడు ఈ ఒక్క మాట ద్వారా సమాధానము
      ఇచ్చినారు.

🔷  ఈ సృష్టి వెనుక అద్భుతమైన మేధోసంపత్తి కలిగిన ఒక
       సృష్టికర్త ఉన్నాడు అని, ఏదీ కూడా దానంతట అదే
       కలగలేదు అని, ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారమే
       చేయబడినది అని ఆయన తెలియజేసినారు.
       ఈ విశ్వము యొక్క రూపకల్పన, ఊహకు అందని
       పరిమాణముతో కూడిన గ్రహములు, నక్షత్రములు,
       అవి తిరుగుచున్న విపరీతమైన వేగములు, చిన్న
       పొరపాటు కూడా లేకుండా అది పని చేసే క్రమమైన
       పద్దతి చూసినపుడు ఖచ్చితముగా దీనివెనుక ఒక
       సూత్రధారి ఉన్నాడు అనేది మనము
       గమనించగలము.

🔴  విశ్వము యొక్క పరిమాణము గురించి ఒక
      అవగాహన వచ్చుటకు దయచేసి 
      వ్యాసమును చదువగలరు.

⬛ ఈ వాక్యము నందు దేవుని యొక్క మహా ప్రేమను
      మనము చూడగలము.
      మనము ఈ శరీరముతో బ్రతికి ఉన్నంత కాలము
      నివాసము చేయటకు భూమిని, శరీరము విడిచిన
      తరువాత శాశ్వత కాలము నివాసము చేయుటకు  
      పరలోకమును ఆయన మనకొరకు చేసినారు.
      దేవుడు చేసిన ఈ విశ్వములో భూమికన్నా కూడా
      ఎన్నో గొప్ప నక్షత్రములు, గ్రహములు ఉన్నను, దేవుడు
      భూమి గురించి ప్రత్యేకముగా మాట్లాడి ఆయన
      మనసులో దానికున్న స్థానమును మనకు
      తెలియజేసినారు

⬜  దేవుని యొక్క జ్ఞానమునకు, ఆయన సృజనాత్మకకు
       విశ్వము ఒక మచ్చుతునకగా మనకు కనిపించు
       చున్నది.

⬜ ఎంతో సాంకేతిక పరిజ్ఞానము ఉన్నను కూడా మనిషి
      ఇంతవరకు ఈ విశ్వము గురించి తెలుసుకున్నది చాలా
      తక్కువ అని చెప్పాలి.

🔷 బైబిలు గ్రంధము ప్రకారము దేవుడు చేసినటువంటి ఈ
      మొట్టమొదటి కార్యమును అర్ధము చేసికొనుటకు
      మనకు ఇన్ని సంవత్సరముల కాలము పడితే, మరి
      దేవుని కార్యములు సంపూర్ణముగా అర్ధము
      చేసికొనుటకు మనకు ఎంత సమయము కావాలో?.

 🔴 అందుకే బైబిలు చెప్తుంది ఆయన చేసిన కార్యములు
       కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు,
      హృదయమునకు గోచరము కాలేదు అని.

🔷 ఇంత గొప్ప జ్ఞానము, శక్తి కలిగిన దేవుని నీవు ఉన్నావా
      అని ప్రశ్నించటము హాస్యాస్పదము అవుతుంది

⬛ మానవులలో ఎవరూకూడా భూమి నిర్మాణ
      కార్యక్రమములో పాలుపంచుకోలేదు.

⬛ దీనిని మన నివాస స్థలముగా చేసికొనుటకు
      అవసరమైన వాతావరణ పరిస్థితులు మనము
      కలిగించలేదు. 

⬛ మనము చిన్న పని కూడా చేయవలసిన అవసరము
      లేకుండానే తానే సమస్తము చేసి మనలకు
      బహుమానముగా ఇచ్చినారు.

🔺 ఎవరైనా ఒక వస్తువును చేసినపుడు దాని మీద సర్వ
      హక్కులు వారే కలిగి ఉంటారు.
  ⚫అలాగే భూమిని చేసిన దేవునికి దానిమీద సర్వ   
      హక్కులు ఉంటాయి.
  ⚫కాని దేవుడు తన మహా ప్రేమచేత మనకు దానిమీద
       హక్కును దారాదత్తము చేసినారు.
  ⚫ఇందుకు గాను మనము కృతజ్ఞతగా ఉండవలసినది
       పోయి ఆయననే ప్రశ్నిస్తూ తిరుగుబాటు
       చేయుచున్నాము.
🔺 ఈ భూమి మాది అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాము.
  ⚫ఇదికేవలముమానవునియొక్కఅహంకారము,
       మూర్ఖత్వము,తెలివితక్కువతనము తప్ప మరేమీ  
       కాదు.
  ⚫మనము ఎంత తిరుగుబాటు చేసినా కూడా
       మననుంచి ఆ హక్కులను లాగుకోనని, మనలను
       క్షమిస్తున్న ప్రేమమూర్తి దేవుడు.

🔺  ఆకాశమందలి వాటిని భూమి మీద ఉన్నవాటిని
       పూజించువారి కన్నులు తెరువబడులాగున దేవుడు
       ఈ వాక్యమునందు అవి అన్నియూ కూడా తన
       హస్తకృతములే అని, అవి అన్నియూ చేసిన ఏకైక
       దేవుడు తానే అని మనకు తెలియజేసినారు
      ఇంతటి సృజనాత్మకత కలిగిన దేవునికి నీ జీవితమును
      తీర్చిదిద్దమని ఆయన చేతికి సంపూర్ణముగా
       అప్పగించిన యెడల అది ఎంత అందముగా ఉండునో
       ఆలోచింపుముఎంతో సంక్లిష్టమైనటువంటి ఈ
       గ్రహముల కదలికలను ఎన్నో సంవత్సరములుగా
       దేవుడు చక్కగా నియంత్రించి క్రమబద్దీకరణ
       చేసియున్నారు.

🔹దీనితో పోల్చుకుంటే నీ జీవితములోని సమస్యలు
     ఏపాటివి?
🔹ఆయన పరిష్కరించలేని సమస్య, క్లిష్టమైన పరిస్థితి
     అంటూ ఏదీలేదు.
🔹లోకములో మనకు తెలియని విషయములను మనము
     అందులో ఎక్కువ పరిజ్ఞానము కలిగిన వ్యక్తుల దగ్గరకు
     వెళ్లి నేర్చుకుంటాము.

⬛ మనము చదువుతున్న ఏ శాస్త్రమైనా కూడా దేవుని
      చేత సృజించబడినదే. ఆయనకు ఉన్నటువంటి
      PHDలు మరి ఈ లోకములో ఎవరికీ కూడా లేవు.
      నాకు మొఱ్ఱపెట్టుము  నేను నీకు ఉత్తరమిచ్చెదను,
      నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన  
      సంగతులను నీకు తెలియజేతును అని దేవుని
      వాక్యము సెలవిస్తూ ఉంది.

▶ మరి ఆయన దగ్గరకు వెళ్లి నీవు ఎందుకు
     నేర్చుకోకూడదు?

    ⚪ ఆలోచించుదేవుని నమ్మిన ప్రముఖ
     శాత్రవేత్తలు

      🔹విలియం డి. హామిల్టన్ – జీవ  శాస్త్రం

     🔹 జొహన్నెస్ కెప్లెర్ – భౌతిక ఖగోళ శాస్త్రం

     🔹బ్లైసీ పాస్కల్ – జల శాస్త్రం

     🔹రాబర్ట్ బోయ్లె – రసాయనశాస్త్రం

     🔹నికోలస్ స్టెనో – స్టాటిగ్రఫీ

    🔹 ఇసక్ న్యూటన్ – గణనవిధానము,గతి శాస్త్రం

    🔹 మైఖేల్ ఫారడే – అయస్కాంత సిద్దాంతము

    🔹 చార్లెస్ బాబేజ్ – కంప్యూటర్ శాస్త్రం

     🔹లూయిస్ పాశ్చర్ – హిమ శాస్త్రం,బ్యాక్టీరియాలజీ

     🔹జేమ్స్ యంగ్ సింప్సన్ – గైనకాలజీ

     🔹గ్రెగోర్ మెండెల్ – జన్యు శాస్త్రం

     🔹లార్డ్ కెల్విన్ – శక్తి శాస్త్రం

     🔹జోసెఫ్ లిస్టర్ – క్రిమినాశక శత్రచికిత్స

     🔹జేమ్స్ క్లెర్క్ మాక్స్వెల్ – విద్యుత్ డైనమిక్స్విలియం

     🔹రామసే – ఇసోటోపిక్ రసాయన శాస్త్రం

🔴 దేవుడు శూన్యములో నుండి సమస్త సృష్టిని కూడా
      చేసినారు.

🔴 నీ జీవితములో కూడా ఇది ఎప్పటికీ జరగదు, కలుగదు
      అని అనుకునే విషయము ఏదైనా కూడా ఆయన
      చేయగలరు.

🔴 విశ్వాసముతో నీవు ఆయనను నమ్మిన యెడల నీ
      జీవితములోని శూన్యమును ఆయన అందమైన
      సృష్టిగా చేయగలరు.

🔴 సృష్టికర్తగా సమస్తమును ఆయన అధీనములో ఉన్నవి.
      ⚫మనకు హాని చేయుటకు ఏదీ కూడా మన దగ్గరకు
       రాదు.
      ⚫ఆయన మన గ్రహమును, మనలను ఎప్పుడూ
      కంటికి రెప్పలా కాపాడును.

🔴 ఇన్ని సంవత్సరముల నుండి ఇన్ని కోట్ల మంది ప్రజల
       నివాసమునకు అవసరమైన అన్ని వనరులనూ
       ఆయన భూమిలో మనకొరకు నిక్షిప్తము చేసినారు.
    ⚫   అందుకు మనము ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత 
       కలిగి ఉండాలిదేవుడు చేసిన సృష్టి ఎకైకమైనది.
    ⚫   ఆకాశము, భూమి, గ్రహములు, వాతావరణము  
       ఏవీ కూడా మరమ్మత్తులు లేకుండా సృజింపబడిన
       దినము నుండి పనిచేయుచున్నవి.
       ⚫అవి నిత్యమూ అలా నిలిచి ఉన్నవి. కావాటి వలన
       మనకు ఎటువంటి దుష్ప్రభావాలు లేవు.
       ⚫కాని మనము ఏది చేసినా కూడా అది నిత్యమూ
       నిలిచి ఉండలేదు. కొంతకాలమునకు
       కనుమరుగవును.
       ⚫వాటి వలన కొంత మంచి కొంత దుష్ప్రభావాలు
       ఉండును.
       ⚫ఎంత తయారుచేయు పరిజ్ఞానము ఉన్నా
       కూడా దేవుని పరిజ్ఞానము ముందు అది దిగదుడుపే
       బైబిలులోని ఈ మొదటి వాక్యము దేవుని మనకు
       పరిచయము చేస్తూ ఉండి.

🔵 ఆదియందు అని మొదటిగా దేవుని మనకు కనపరచు
       చున్నది.
     ⚪  అలానే మనము కూడా ప్రతి పని ముందు దేవుని 
       పెట్టుకోవాలి అని మనకు తెలియజేస్తూ ఉంది.
       మనము పని మొదలు పెట్టి అందులో అడ్డంకులు
       వచ్చినపుడు దేవుని దగ్గరకు రావటము కాకుండా,  
       మొదటిగానే దేవుని దగ్గరకు వచ్చి ఆయన
       సహాయము, అనుమతి అడగాలి.

🔴   దేవుడు ఇంతగొప్ప సృష్టిని కూడా తన వాక్కు ద్వారా
       చేసినట్లు బైబిలు మనకు సెలవిస్తూ ఉంది.
       ⚫ఇంత గొప్ప శక్తి కలిగిన వాక్యమును ఆయన మన
       చేతిలో, మన నోటిలో ఉంచినందుకు ఆయనకు  
       మనము ఎంతైనా విధేయత, కృతజ్ఞత కలిగి ఉండాలి.
      ⚫ సమస్తమును సృష్టించిన దేవునికి ఈ విశ్వములో 
       మరుగై ఉన్న ప్రదేశము, విషయము ఏదీ లేదు.
       ⚫మనము ఆయన నుండి తప్పించుకుని    
        దాగుకోనదగిన స్థలము ఏదీ కూడా లేదు.

     ⚪ మనము ఆయనకు లోబడి ఉండక పోయినా కూడా   
      ఇంకా ఆయన సృష్టిలో మనకు స్థానము కల్పించిన
      దేవుని ప్రేమ ఎంతో గొప్పది.

   ⚪   వేరే గ్రహములలో ఉన్న వాతావరణ పరిస్థితులను   
      మనము చూచినపుడు దేవుడు మనకు అన్ని
      విధములుగా ఉన్నతమైన, ఉత్తమమైన గ్రహమును
      చేసి ఇచ్చెను అని మనము అర్ధము చేసికోనగలము.

    ⚪  గ్రహములు వాటి వాటి కక్ష్యలలో దేవుని ఏర్పాటు 
      ప్రకారము మొదటి దినము నుండి తిరుగుచున్నవి.

    ⚪ దీనిని బట్టి మనము ఎంతైనా విధేయత అనేది  
     నేర్చుకొనవలయును.

    ⚪వాటిలానే మనము కూడా మన జీవితమును దేవుని
     చుట్టూ తిరుగుతూ కట్టుకోవాలి.

    ⚪గ్రహములు వాటి కక్ష్యనుండి తప్పిన యెడల అవి   
     నియంత్రణ కోల్పోయి నాశనమగును.

    ⚪మనము కూడా దేవుడు మనకు ఏర్పాటు చేసిన   
      పరిధి నుండి, రక్షణ వలయము నుండి బయటకు
      వచ్చినట్లయితే మన జీవితము కూడా నియంత్రణ
      కోల్పోయి నాశనమునకు దారితీయును.

      ⚪దేవుని మించిన చిత్రకారుడు కాని, కవి కాని ఎవరూ
      కూడా లేరు.

      ⚪ఎవరు చిత్రపటము వేసినా ఆయన సృష్టిలోని
      అంశములను చిత్రీకరించును.

      ⚪కవి ఎంత వర్ణన చేసినా కూడాఆయనసృష్టిలోని     
      అంశములతో పోల్చును.

      ⚪నీ జీవితమును ఆయనకు అప్పగించిన యెడల ఏ
      మనిషీ గీయలేని మంచి చిత్రముగా, ఏ కవి రాయని
      మంచి కవితగా ఆయన చేయగలరు.

🔴 సృష్టి యొక్క పరిమాణము బట్టి మనకు ఆయన
      ప్రణాళికల యొక్క పరిమాణము మనము అర్ధము
      చేసికొనవచ్చు.

⚫నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు
     నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు 
     ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ
     మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా
     తలంపులు అంత యెత్తుగా ఉన్నవి అని బైబిలు
     చెప్తుంది.

   ⚫  మరి ఆయన నీ జీవితములో ఎంత గొప్ప ప్రణాళిక
     కలిగి ఉన్నారో నీవు తెలిసికోన్నావా?

                             🔘అర్ధములు🔘

                             💠 దేవుడు 💠

 🔵 ఈ వాక్యము నందు దేవుడు అనేటటువంటి
      పదమునకు దేవుళ్లు అని అర్ధమునిచ్చే ఎలోహిమ్ అనే
      హీబ్రూ పదము ఉపయోగించబడినది.

                             🔘రిఫరెన్సులు🔘

🔶  ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద 
      ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

🔶 ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను.
      సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
      కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
      (యోహాను 1:1-3)

🔶   మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి  
       పునాది వేసితివి
      (హెబ్రీయులకు 1:10)

🔶  నీ చేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన
      చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని
      జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?
      నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
      (కీర్తనలు 8:3, 4)

  🔶 ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని
        పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తరదక్షిణములను
        నీవే నిర్మించితివి. (కీర్తనలు 89:11, 12)

  🔶 తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను
        ఆయన కృప నిరంతరముండును. (కీర్తనలు 136:5)

  🔶 గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు
       యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
       యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను
       నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే
       భూమిని పరచినవాడను (యెషయా 44:24)

  🔶  ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన
        జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన
        ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
        (యిర్మియా 10:12)

  🔶  ఆకాశమండలమును విశాలపరచి భూమికి
         పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను
         సృజించు యెహోవా (జెకర్యా 12:1)

  🔶  మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును
        భూమిని సముద్రమును వాటిలో ఉండు
        సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు
        తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము
        (అపోస్తలుల కార్యములు 14:15)

  🔶  ఏలయనగా ఆకాశమందున్నవియు
        భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని,
        అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను
        ప్రభుత్వములైనను ప్రధానులైనను
        అధికారములైనను, సర్వమును ఆయనయందు
        సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను
        ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన
        అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే
        సమస్తమునకు ఆధారభూతుడు.
       (కొలొస్సయులకు 1:16, 17)

🔶   ప్రపంచములు దేవుని వాక్యమువలన
       నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది
       కనబడెడు పదార్థములచే నిర్మింప బడలేదనియు
       విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
       (హెబ్రీయులకు 11:3)

  🔶  ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి;
         నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే
         సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత
         ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచూ తమ
         కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.    .    
         (ప్రకటన 4:11)

🔶   ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి
         ఆకాశములు కూడ నీ చేతిపనులే.
        (కీర్తనలు 102:25)

  🔶  ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు
         దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు
         ఒకడు తెరను విప్పినట్లు ఆయన
         ఆకాశవైశాల్యమును  వ్యాపింపజేసెను ఒకడు
         గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస
         స్థలముగా ఏర్పరచెను.
         (యెషయా 40:22)

  🔶  పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును
        నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే
        దేవుడవు
        (కీర్తనలు 90:2)

  🔶  జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు
         తానే ఆకాశమునకును భూమికిని
         ప్రభువైయున్నందున హస్తకృతములైన
         ఆలయములలో నివసింపడు.
        (అపోస్తలుల కార్యములు 17:24)

  🔶   ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన
          నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి
          మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను
          ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు  
          నిరుత్తరులై యున్నారు.
         (రోమీయులకు 1:20)

  🔶   ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా
          మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని
          సమస్తమునకును వారసునిగా నియమించెను.
          ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
          (హెబ్రీయులకు 1:2)

  🔶  ఆరు దినములలో యెహోవా ఆకాశమును
         భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును
         సృజించి, యేడవ దినమున విశ్ర మించెను;
         అందుచేత యెహోవా విశ్రాంతిదినమును
         ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.  
         (నిర్గమకాండము 20:11)

   🔶  జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే
         యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.
         (1దినవృత్తాంతములు 16:26)

  🔶  నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును
         మహాకాశములను వాటి సైన్యమును, భూమిని
         దానిలో ఉండునది అంతటిని, సముద్రములను
         వాటిలో ఉండునది అంతటిని సృజించి
         వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ
         సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.
         (నెహెమ్యా 9:6)

  🔶   ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు
          అందము వచ్చును. (యోబు 26:13)

  🔶   నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ
         నుంటివి? (యోబు 38:4)

  🔶  యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన
         నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
         (కీర్తనలు 33:6)

  🔶  జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా
         ఆకాశవిశాలమును సృజించినవాడు.
         (కీర్తనలు 96:5)

  🔶  యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా
         నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి
         నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
         (కీర్తనలు 104:24)

  🔶   భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత 
          మీరు ఆశీర్వదింపబడినవారు.
          (కీర్తనలు 115:15)

  🔶   యెహోవావలననే నాకు సహాయము కలుగును
          ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
          (కీర్తనలు 121:2)

  🔶   భూమ్యాకాశములను  సృజించిన  యెహోవా
          నామము  వలననే మనకు సహాయము
          కలుగుచున్నది.
          (కీర్తనలు 124:8)

  🔶  భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో
         నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.
         (కీర్తనలు 134:3)

  🔶   ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని
         లోని సర్వమును సృజించినవాడు ఆయన
          ఎన్నడును మాట తప్పనివాడు. 
         (కీర్తనలు 146:6)

  🔶   పరమాకాశములారా, ఆకాశముపైనున్న
         జలములారా,  ఆయనను స్తుతించుడి. యెహోవా
         ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా
         నామమును స్తుతించును గాక
         (కీర్తనలు 148:4, 5)

  🔶  జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను
         వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును
         స్థిరపరచెను.
        (సామెతలు 3:19)

  🔶  యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న
         ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను
         కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న
         సకల రాజ్యములకు దేవుడవై యున్నావు.   
        (యెషయా 37:16)

  🔶  ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి
        భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి
        దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో
        నడచు  వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన
        యెహోవా  ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 
       (యెషయా 42:5)

  🔶  ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు;
         ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర 
         పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని
         సృజింప  లేదు నివాసస్థలమగునట్లుగా దాని
         సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా
         యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.  
         (యెషయా 45:18)

  🔶  ఆకాశములను వ్యాపింపజేసి భూమి
         పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన
         యెహోవాను మరచుదువా?
        (యెషయా 51:13)

  🔶  నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి
        పునాదులను వేయునట్లును నాజనము నీవేయని
        సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు
        ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.
        (యెషయా 51:16)

  🔶 యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు
        యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా,
        మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన
        బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి,
        నీకు అసాధ్యమైనదేదియు లేదు.
        (యిర్మియా 32:17)

  🔶  నా జీవముతోడని సైన్యముల కధిపతియగు   
        యెహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన
        బలముచేత భూమిని సృష్టించెను తన జ్ఞానముచేత
        ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును
        విశాలపరచెను. 
        (యిర్మియా 51:15)

  🔶  వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా
         మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని
         సముద్రమును వాటిలోని సమస్తమును   
         కలుగజేసినవాడవు.
         (అపోస్తలుల కార్యములు 4:24)

  🔶  పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని
         అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో
        ఉన్న వాటిని సృష్టించి, యుగయుగములు
        జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొనిఇక
         ఆలస్యముండదు గాని
         (ప్రకటన 10:6)

  🔶  అతడుమీరు దేవునికి భయపడి ఆయనను
        మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ
        వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును
        జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము
        చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను
        (ప్రకటన 14:7)

                       💠స్తుతి ఆరాధన💠

🔴   ఇంతటి మహా విశ్వమును చేసి దానిలో మనలను
       పాలిబాగస్థులుగా చేసినందుకుభూమి అనేటటువంటి
       అందమైన ప్రదేశమును మనకు నివాసస్థలముగా
       ఇచ్చినందుకుభూమికి మరియు అందులోని ప్రజలకు
       తన హృదయములో ప్రత్యేకమైన స్థానము
        ఇచ్చినందుకుభూమి మీద జీవితము చాలించిన
       తరువాత ఊహకు అందనటువంటి, వర్ణింపశక్యము
        కానటువంటి నివాసస్థలమైన పరలోకము
        చేసినందుకుఇంత సృష్టి చేసిన ప్రభువైన యేసుక్రీస్తు
        కొరకుఆది నుంచి అంతము వరకూ కూడా మనతో
       ఉన్న ఆయన సన్నిధి కొరకుఇంతటి శక్తి కలిగిన
       ఆయన వాక్యమును మనకు
       దయచేసినందుకుభూమిని విశ్వములో సరైన
       స్థానములో నిలిపి దానిని కంటికి రెప్పలా
       కాపాడుతున్నందుకుఈ విశ్వములో గొప్పవి ఎన్నో
       ఉన్నా కూడా మనతో సహవాసము కోరిన ఆయన
       ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ప్రేమ
       కొరకుసృజనాత్మకత విషయములో మనకు మాదిరిగా
       ఉన్నందుకు

                          💠💠ప్రార్ధన💠💠

🔷   ప్రియ పరలోకపు తండ్రి మాకొరకు మీరు చేసిన ఈ
        అద్భుతమైన సృష్టి కొరకు మీకు వందనములు.
        ఏమి ఇచ్చినా కూడా మీ ఋణము మేము
        తీర్చుకోనలేము. మీరు మాకొరకు కలిగి ఉన్న ప్రేమను
        గుర్తించి మీకు విధేయులుగా బ్రతకటానికి మాకు
        సహాయము చేయండి. యేసు నామమున
        ప్రార్దిస్తున్నాము తండ్రి.

                       💠💠   ఆమెన్    💠💠

Comments

Popular Posts